అంబాలాలో

అంబాలాలో మద్యం మత్తులో పోలీస్ అధికారి ఢీ: యువతి మృతి

Published on: 📅 12 Feb 2026, 12:20

హర్యానా అంబాలాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నికితా (24) అనే యువతి మృతి చెందింది. మద్యం మత్తులో ఉన్న ఓ పోలీస్ అధికారి కారు, ఆమె ప్రయాణిస్తున్న ఈ-రిక్షాను ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఢీ అనంతరం నికితా వాహనం నుంచి కిందపడగా, ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కుటుంబ సభ్యులు అంబాలా సివిల్ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ప్రమాదానికి కారణమైన PSI అమిత్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

Sponsored