చిరంజీవికి

చిరంజీవికి క్షమాపణలు చెప్పిన ఆర్జీవీ

Published on: 10-11-2025

మెగాస్టార్ చిరంజీవికి దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ వేదికగా క్షమాపణలు చెప్పారు. 'శివ' సినిమా 14వ తేదీన రీలీజ్ సందర్భంగా చిరంజీవి ఒక వీడియోలో రామ్‌గోపాల్ వర్మను ఉద్దేశించి మాట్లాడారు. తెలుగు సినిమా భవిష్యత్తు ఈ యువ దర్శకుడికి ఉంది అని ఆనాడే తను భావించినట్లు చెప్పారు. దీనికి స్పందించిన వర్మ, చిరంజీవికి కృతజ్ఞతలు తెలుపుతూ, "విశాల హృదయంతో మా బృందాన్ని అభినందించినందుకు కృతజ్ఞతలు. అనుకోకుండా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను" అని ట్వీట్ చేశారు. గతంలో చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని వర్మ క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది.

Sponsored