కమల్‌హాసన్

కమల్‌హాసన్ కథానాయకుడిగా...

Published on: 08-11-2025

ప్రముఖ నటుడు కమల్‌హాసన్ తన సొంత సంస్థ రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై వరుసగా సినిమాలు నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా, రజనీకాంత్ మరియు సుందర్.సి కలయికలో రాబోయే సినిమాను అధికారికంగా ప్రకటించారు. తాజాగా, ఒక ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ మరొక సినిమాను ప్రకటించారు. ఈ చిత్రంలో కమల్‌హాసన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. 'విక్రమ్' సినిమాకు స్టంట్స్ అందించిన అన్వరివ్ ద్వయం ఈ చిత్రంతో దర్శకులుగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాకు సునీల్ కె.యస్ ఛాయాగ్రాహకుడు, జోన్ విజయ్ సంగీత సమకూర్చనున్నారు.

Sponsored