ఆసియా కప్-2025 విజేతగా నిలిచిన భారత జట్టుకు ఇప్పటికీ ట్రోఫీ అందకపోవడంపై పెద్ద వివాదం నడుస్తోంది. పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి, ఏసీసీ ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి భారత జట్టు నిరాకరించింది. దీనిపై బీసీసీఐ (BCCI) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి, ట్రోఫీని త్వరగా అందించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) నిర్ణయించింది. ఈ కమిటీకి ఒమన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ పంకజ్ ఖిమ్జీ నాయకత్వం వహించనున్నారు.