భారత్‌కు చెందిన అజిత్ సింగ్ అనే 22 ఏళ్ల వైద్య విద్యార్థి రష్యాలోని అమసనావ్‌స్కీ నగరంలో మరణించాడు. దాదాపు మూడు వారాల క్రితం అదృశ్యమైన అతని శవం తాజాగా డ్యామ్‌లో లభ్యమైంది. రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన అజిత్ 2023లో వైద్య విద్య కోసం రష్యాకు వెళ్లి, ఒకటోపల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదివేవాడు. అక్టోబర్ 10 నుంచి కనిపించకుండా పోయిన అతడి డ్రెస్సులు, ఫోన్ నది సమీపంలో లభించాయి. అజిత్ మృతికి కారణాలు తెలియరాలేదు. దీనిపై విదేశాంగ శాఖ స్పందించింది.